ఇంటర్మీడియట్ ఫలితాలలో శ్రీహర్షిణి విద్యార్థులు విజయభేరి మోగించారు. జూనియర్ ఇంటర్ ఫలితాలలో MPC విభాగంలో అడకా.మధు కిరణ్, మాదాల వెంకట్రావు, బొమ్మిశెట్టి హర్షవర్ధన్ అను విద్యార్థులు (464 / 470) మార్కులతో కళాశాల మొదటి స్థానాన్ని సాధించారు. నంబూరి. మృదుల, రావి. యశ్విత, లెక్కల శివారెడ్డి, వంకాయపాటి జాన్ తేజ అను విద్యార్థులు (463 /470) మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు. Bipc విభాగంలో కటారి హారిక, షేక్ కౌసర్ ( 429 /440 )మార్కులతో కళాశాల మొదటి స్థానాన్ని సాధించారు, MEC విభాగం నందు నున్న సుహాసి (468 /500 )మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు, CEC విభాగం నందు అత్యాలా. రవీంద్ర (469 /500) మార్కులతో మొదటి స్థానాన్ని, సింగంశెట్టి సాయి దుర్గ, తొగరు. రవీంద్ర (467 / 500) మార్పులతో మొదటి స్థానాన్ని సాధించారు. 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 216 సీనియర్ ఇంటర్ ఫలితాలలో Mpc విభాగంలో లాం శరణ్య (983 /1000) మార్కులతో మొదటి స్థానాన్ని, పిజ్జా బేగం( 980 /1000) మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు, BIPC విభాగము నందు D ప్రియాంక (983 /1000 )మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు. సీనియర్ ఇంటర్ భాగంలో 900 పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 115. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు . గత తొమ్మిది సంవత్సరాలుగా సాధారణ విద్యార్థులతో జిల్లా, స్టేట్ స్థాయిలో మొదటి ర్యాంకులు సాధించటానికి కారణమైన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఇదేవిధంగా రాబోవు ఎంసెట్ పరీక్షలలో కూడా మంచి ర్యాంకు లు సాధించాలని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత , డీన్ దాది ఆంజనేయులు , కళాశాల ప్రిన్సిపాల్ కరణం నారాయణ , దివి రమేష్ , AO శేఖర్ , మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.