ఇంటర్మీడియట్ ఫలితాలలో సత్తా చాటిన ఒంగోలు కాలేజీల విద్యార్థులు

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ఒంగోలు విద్యార్థులు తమ సత్తాను చాటారు. ఆయా కళాశాల చైర్మన్లు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు తమ విద్యార్థులు సాధించిన ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేసి తమ విద్యార్థులను అభినందించారు. •

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శ్రీ ప్రతిభ విద్యాసంస్థలలో …
ఇంటర్మీడియట్ ఫలితాలలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటినట్లు ప్రతిభ విద్యాసంస్థ చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎన్ వెంకట తరుణ్ క్రిష్ణ (986), ఎం పద్మావతి (985), ఆర్ ధనలక్ష్మి (984), ఎ నిఖిత (984), కె మహేంద్ర (984), ఈ సాయి వెంకట సాహిత్ (983), జి మోహిత సాయి (983), ఎన్ శివ నారాయణ (983), డి శ్రీవర్ధన్ రెడ్డి (982), కె పూజిత (980), బైపీసీ విభాగంలో బి స్వాతి (985), టి దుర్గా ప్రసన్న (983), చిన్నపురెడ్డి వైష్ణవి (982) సాధించినట్లు చెప్పారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 465 మార్కులు ఐదుగురు, 464 మార్కులు ఒకరు, 463 మార్కులు ముగ్గురు, 462 మార్కులు ఎనిమిది మంది, 461 మార్కులు నలుగురు, 460 మార్కులు నలుగురు విద్యార్థులు సాధించారని, బైపీసీ విభాగంలో 431 మార్కులతో సాధించారని చెప్పారు. రాష్ట్ర స్థాయి ర్యాంక్లతో ఉత్తమ ప్రతిభ చాటారని చెప్పారు. సీనియర్ ఇంటర్ లో 91శాతం, జూనియర్ ఇంటర్లో 82శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. విద్యార్థులను చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు, సీఈఓ నల్లూరి జయప్రకాశ్ నారాయణ్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *