ఇంటర్మీడియట్ ఫలితాలలో వికే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 88శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ప్రధమ స్థానంలో నిలచినట్లు ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 25 మందికి గాను 22 మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. సీఎస్సీ విభాగంలో తూము క్రిష్ణ కాంతి (900/1000), తళ్ల వైష్ణవి (823/1000) సాధించి కళాశాలలో ప్రధమ, ద్వితీయ స్థానాలలో నిలిచినట్లు ఓకేషనల్లో ఈఈటీ విభాగంలో కె. నరసింహా (986/100), కప్పెర బుచ్చయ్య (985/1000) సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచినట్లు చెప్పారు.
జూనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో 39 మందిగాను 19 మంది ఉత్తీర్ణత సాధించి 48శాతం ఉత్తీర్ణత పొందినట్లు చెప్పారు. సీఎస్సీ విభాగంలో సీహెచ్ దీపిక (397/500) సాధించగా, ఒకేషనల్ విభాగంలో అనపర్తి వాగ్యలక్ష్మి (479/500)లు సాధించినట్లు చెప్పారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్. కళాశాల లెక్చరర్స్ ప్రత్యేకంగా అభినందించారు.






