ఇంటర్మీడియట్ ఫలితాలలో సత్తా చాటిన ఒంగోలు కాలేజీల విద్యార్థులు

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ఒంగోలు విద్యార్థులు తమ సత్తాను చాటారు. ఆయా కళాశాల చైర్మన్లు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు తమ విద్యార్థులు సాధించిన ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేసి తమ విద్యార్థులను అభినందించారు. •

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సరస్వతి విద్యా సంస్థలో ..
సరస్వతి విద్యాసంస్థలలో సీనియర్ ఇంటర్ ఫలితాలలో కె సాయి కిరణ్ (991/100) సాధించి స్టైట్ టాప్ ర్యాంక్ సాధించినట్లు ఆ సంస్థ చైర్మన్ఎవీ రమణా రెడ్డి తెలిపారు. అదే విధంగా జూనియర్ ఇంటర్ లో సీహెచ్ ఉదయ్ కిరణ్ (466/470), ఎ వెంకట భాను ప్రకాష్ (466), ఎం అజయ్కుమార్ (466), కె హేమలత (466), ఎం. భాను ప్రకాశ్ (466) సాధించినట్లు తెలిపారు. 466 మార్కులు సాధించిన వారు 6 మంది, 465 మార్కులు పైన 11 మంది, 464 మార్కులు సాధించిన వారు 18 మంది . 460 మార్కులు సాధించిన వారు 126 మంది, 450 మార్కులు పైగా 248మంది, అలాగే జూనియర్ ఇంటర్ బైపీసీలో ఆర్ జెస్సీ (435/440) స్టేట్ టాప్ ర్యాంక్ సాధించినట్లు చెప్పారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ ఏవీ రమణా రెడ్డి, డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి, ఎ గంగా శంకర్ రెడ్డి, సీఈఓ ఎస్వి సురేష్, డీన్స్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *