కిమ్స్ హాస్పటల్లో శనివారం అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించినట్లు కిమ్స్ మెడికల్ సూపరిండెంట్ టి. శ్రీ హరి రెడ్డి తెలిపారు. స్థానిక వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. యర్రగొండ పాలెం నియోజక వర్గంకు చెందిన ఒక మహిళ అనారోగ్యసమస్యతో బాధపడుతూ కిమ్స్ హాస్పటల్ క్కు రాగా గ్ర్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అశోక్ కుమార్ వేములపాటి పరీక్షించి ఆమె ‘ఆచలాసియా కార్డియా అను అరుదైన రుగ్మతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ రోగనిర్ధారణను ప్రత్యేక పరికరాలతో గుర్తించి పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే అందుబాటులో ఉంటే పేరోరల్ ఎండోస్కోపిక్ మయోటోమి (పీఓఈఎం) ను ( అన్నవాహికలో దుస్సంకోచాలు వంటి కండరాల సమస్య వలన కలిగే మ్రింగుట రుగ్మతకు చేయు చికిత్స) ను తక్కువ ఖర్చుతో చేసినట్లు చెప్పారు. కిమ్స్ వైద్యశాలలో అన్ని రకాల జీర్ణకోశ, లివర్, పాంక్రియాస్ వ్యాధులకు చికిత్స చేయుటకు వీలుగా జీర్ణకోశ, లివర్ విభాగమును అభివృద్ధి చేసినట్లు వివరించారు. అందుకు నిత్యం సహకరించిన కెమ్స్ మెనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని భాస్కరరావు ఈడి టి గిరి నాయుడు కి కిమ్స్ చీఫ్ ఆపరేటర్ (సీఓ) కె ఆంకి రెడ్డి, సూపరిండెంట్ టి శ్రీహరి రెడ్డి. జీఎం(మార్కెటింగ్) అమర్ నాథ్ లు కృతజ్ఞతలు తెలిపారు.




