సీఎం వైఎస్ జగన్ కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే టీడీపీ నేతలు కుట్రలకు తెర లేపారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుజ్జపల్లి వెంకాయమ్మ ,వైఎస్ఆర్సిపి దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ హత్యాయత్నం ముమ్మాటికీ టీడీపీ నేతల కుట్రే అని, దాడి ఘటనపై ఆ పార్టీ నేతలు స్పందించిన తీరు సభ్య సమాజం తలదిం చుకునేలా ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎంపై హత్యాయత్నాన్ని ఖండిస్తూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కాబోతోందని అవగతం కావడంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్ర బాబు కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ తరచూ తమ కార్యకర్తలను రెచ్చగో ట్టేలా మాట్లాడుతుండటమే అందుకు నిదర్శనమ న్నారు. సమావేశంలో మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, ఎంపీపీ సుధాఅచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ షేక్ షకీలా అమీన్ భాషా, వ్యవసాయ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి ,పట్టణ అధ్యక్షులు కట్టెకోట హరీష్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, నెడ్కాప్ డైరెక్టర్ సాని కొమ్ము తిరుపతిరెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, రాష్ట్ర కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకనాటి మహానంది. వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాళ్లూరు మండలంలో…
సీఎం జగన్ పై దాడి హేయమైన చర్య ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హత్యాయత్నం హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. తూర్పుగంగవరంలో వైఎస్సార్ సీపీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో తాళ్లూరు మండల ఇన్చార్జిలో మస్తాన్ రెడ్డి, నరసింహారెడ్డి జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి, మంచాల ప్రియాంకా నాగార్జునరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టివి సుబ్బారెడ్డి ,జేసీఎస్ కన్వీ నర్ యాడిక శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదనరెడ్డి, గోళ్లపాటి మోషే, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పూనూరి దేవదానం, సొసైటీ అధ్యక్షులు యాడిక యలమందారెడ్డి, కుమ్మిత జయరామిరెడ్డి, కోఆప్సన్ సభ్యులు కరిముల్లా, ఎంపీటీసీ యామర్తి ప్రభు దాసు, సర్పంచ్ లు మందా శాంసన్, పిఎస్ శ్రీకాంత్ రెడ్డి, కేఎస్ వెంకటరామిరెడ్డి , ఏఎంసీ మాజీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి , దేవదానం రామకృష్ణ తదిత రులు పాల్గొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వైఎస్ఆర్సిపి శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.




