వేసవిలో వాహన దారులకు ,పాద చారులకు తాగునీటిని అందించేందుకు నగరం లోని అన్ని ప్రాంతాల్లో చలి వేండ్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రయివేటు సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్రాఫిక్ 1 ఏ సీ పీ జీ.శంకర్ రాజు పిలుపు నిచ్చారు.సోమవారం బేగంపేట అశోక్ భూపాల్ చాంబర్స్ సత్యం వెంచర్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అవరణలో మినరల్ వాటర్ కియోస్క్ కేంద్రాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న శంకర్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఏటా వేసవి తాపం పెరుగుతుందని,దీన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక సంస్థలు,ప్రభుత్వ ,ప్రయివేటు రంగ సంస్థలు ఇలాంటి చలి వేండ్రాల ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.సత్యం వెంచర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా మినరల్ వాటర్ అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినండ నేయమని ఆయన పేర్కొన్నారు.ప్రతి ఏటా ఇదే ప్రాంతం లో వారు చల్లని మినరల్ వాటర్ చలివెండ్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని ,గడచిన 3 సంవత్సారాలు గా అనివార్య కారణాలతో వారు ఇక్కడ చలి వెండ్రాన్ని ఏర్పాటు చేయలేక పోయారని ,ఈ ఏడాది పునః ప్రారంభించడం సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యం వెంచర్ ఇంజనీరింగ్ సి ఈ ఓ వడ్లమూడి శ్రీనివాస్, ఏ సీ పీ శంకర్ రాజు.బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాపయ్య తది తరులు పాల్గొన్నారు.




