ఇన్ స్టా గ్రామ్ లో వివిధ రకాలైన వాహనాల విన్యాసాలు చేస్తూ ఫేమస్ కావాలనుకున్నారు ఇద్దరు. చూపరులను ఆకట్టుకునే విధంగా వారి మెప్పు పొందాలంటే ద్విచక్ర వాహనాలతో రోడ్లపై వివిధ రకాలైన విన్యాసాలు చేయాలనుకున్నారు. కానీ ఇది సక్రమమైన పద్ధతిలో కాకుండా చోరీ చేసిన వాహనాల నంబర్ ప్లేట్లు మార్చి చేయడం తో వారిలో పుట్టిన ఈ చెడు ఆలోచన చివరికి కటకటాల్లోకి నెట్టేలా చేసింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఇద్దరు యువకులు నగరంలో ద్వి చక్ర వాహనాలను దొంగిలించి అదే వాహనాల తో స్తంట్లు చేస్తూ ఇన్ స్థా గ్రామ్ లో పోస్టులు పెట్టడంతో పోలీసులకు దొరికి పోయారు.ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేయడం కోసం ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ఇద్దరు వ్యక్తులను బేగంపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.ఈ సందర్భంగా బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఉత్తర మండల డి సీ పీ రోహిణి ప్రియదర్శిని ,బేగంపేట ఏ సీ పీ గోపాల కృష్ణమూర్తి,బేగంపేట ఇన్స్పెక్టర్ రామయ్య, డి ఐ మల్లేశం,లతో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీ సీ పీ రోహిణీ ప్రియదర్శిని వివరాలను వెల్లడిస్తూ
నిందితుల నుండి 9 ద్వి చక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు.వీరు నగరంలోనీ ఎస్ ఆర్ నగర్,హుమాయూన్ నగర్, ఫిల్మ్ నగర్,రామ్ గోపాల్ పేట ,బేగంపేట్ పోలీస్ స్టేషన్లు పరిది లో వివిధ ప్రాంతాలలో నిలిపి ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడి నట్లు గుర్తించారు.
చాంద్రాయణ గుట్టకు చెందిన షేక్ ఇబ్రహీం (19)తో పాటు మరో మైనర్ బాలుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు.బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 13వ తేదీన తన జ్యూపిటర్ కనిపించడం లేదంటూ స్మితా పటేల్ అనే మహిళ బేగంపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.ఆమె పిర్యాదు ఆధారంగా కేసే నమోదు చేసుకుని సి సి కెమెరాలను పరిశీలించగా చాంద్రాయణ గుట్ట లోని షాహిన్ నగర్ ప్రాంతంలో నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని గుర్తించామన్నారు.చాసిస్ నంబర్ ఆధారంగా పరిశీలిస్తే అది బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోరికి గురైన జూపిటర్ అని గుర్తించారని అన్నారు .నిందితులను సి సి కెమెరాల ఆధారంగా గుర్తించి విచారించగా అసలు విషయాలు వెలుగు లోకి వచ్చాయన్నారు.ఈ కేసే లో బేగంపేట పోలీస్ లు చాక చక్యం గా వ్యవహరించింది నిందితుని నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారని డీ సీ పీ వెల్లడించారు.అనంతరం డీ సీ పీ రోహిణీ ప్రియదర్శిని మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేవారు ఇళ్లకు ,వాహనాలకు ,తాళాలు వేసుకుని వెళ్లాలని వీలైతే సెన్సార్లు సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవాలని సూచించారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎస్సైలు కొర్వ గంగాధర్,జయచంద్ర.క్రైం సిబ్బంది పాల్గొన్నారు.


