రోగుల ఆరోగ్య బలహీనతలను ఆసరాగా చేసుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న నకిలీ ఆయుర్వేద గ్యాంగ్ బృంద సభ్యుల ముఠా గుట్టు ను రట్టు చేసారు మధురా నగర్ పోలీసులు. మంగళ వారం ఎస్సార్ నగర్ ఏసిపి కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసిపి వెంకట రమణ ,పంజాగుట్ట ఏసిపి మోహన్ కుమార్ లు ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ,మధురా నగర్ ఇన్స్పెక్టర్ మధు సుధన్ రెడ్డి ల తో కలిసి వివరాలను వెల్లడించారు.
పలు ఆరోగ్య సమస్యల తో బాధ పడుతున్న వారిని గుర్తించి ,వారు పడుతున్న సమస్యల మాదిరిగానే తమ కి తెలిసిన వారు కూడా ఇదే తరహా సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అంటూ వారితో మాటలు కలుపుతారు.అప్పటి నుండి తమ పథకాన్ని అమలు చేస్తారు ఈ గ్యాంగ్.అందులో భాగంగానే వారి సమస్యల్ని తమకు తెలిసిన ఆయుర్వేద ఔషధాలు దుకానాన్ని సంప్రదిస్తే వారు సూచించిన ఔషధాలను వినియోగించడం వల్ల పూర్తిగా నయం అవుతుందని సూచిస్తారు.అనంతరం సదరు షాపు నిర్వాహకులు తాము సూచించిన ప్రత్యేక లేహ్యాలు,భస్మాలను కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తారు. అసలు సమస్య కి సరైన మందులు సూచించే పరిజ్ఞానం లేకపోవడం , కేవలం ధనార్జనే పరమావధిగా ఔషదాల ను కొనుగోలు చేసేలా చేయడం మూలంగా రోగులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది .దీని వల్ల రోగులు ఆర్థికంగా , శారీరకంగా , మానసికంగా నష్ట పోతారు. తాము మోసపోయాము అన్న సంగతి నీ గ్రహించే లోగానే జరగాల్సిన నష్టం జరగిపోతుంది. ఆ తరువాత రోగులు ఇబ్బందులు పడుతున్నారని పోలీసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ నకిలీ ముఠా సభ్యులు బృందాలు గా ఏర్పడి రోగుల నుంచి లక్షల్లో వసూళ్లకు పాల్పడుతూ మోసం చేస్తున్నారని ,ఇప్పటి వరకు
ఈ గ్యాంగ్ సభ్యుల పై నగర వ్యాప్తంగా 14 కేసులకు పైగా నమోదు అయ్యాయని, తెలిపారు. ఇలాంటి ముఠా సభ్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని, మోసపోవద్దని ,ఇప్పటి వరకూ ఇలాంటి గ్యాంగ్ సభ్యుల అరాచకాలకు బలైన వారు తమను సంప్రదించాలి అని ఏసిపి మోహన్ కుమార్, వెంకట రమణ లు సూచించారు.
