సికింద్రాబాద్ ఎస్పి రోడ్డు హనుమాన్ దేవాలయంలో నేడు శ్రీ సీతారామ కల్యాణం మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు దేవాలయ ఈవో శ్రీనివాస్ శర్మ తెలిపారు. మంగళవారం దేవాలయంలో ఆయన మాట్లాడుతూ… బుధవారం ఉదయం 10.30 గంటలకు దేవాలయంలో సీతారామ కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులకు తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అలాగే
ఈ నెల 23 న హనుమత్ విజయోత్సవం కూడా వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. దేవాలయంలో కల్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి కల్యాణ మహోత్సవాలను తిలకించవచ్చునని చెప్పారు.
ఎస్ పి రోడ్ లోని వీర హనుమాన్ దేవాలయంలో ముస్తాబైన ఫోటో దృశ్యాలు



