జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని తిరునాళ్ల వేలం పాటలు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొబ్బరి కాయలు అమ్ముకునేందుకు, కొబ్బరి చిప్పల ప్రోగు చేసుకునేందుకు హక్కులను నర్రవాడకు చెందిన శివ శీల దక్కించుకున్నది. కొబ్బరికాయలు అమ్ముకున్నందుకు రూ. 1.59లక్షలు, కొబ్బరి చిప్పల ప్రొగుకు రూ.35,000లకు దక్కించుకున్నారు. రెండు పాలలు కలిపి రూ. 1,94,000లు దక్కించుకున్నారు. ఈ సంవత్సరం ఎన్నికల సందర్బంగా తిరునాళ్లకు ప్రభలు రాకపోవటంతో వేలం పాటల ధరలు కూడ పూర్తిగా దక్కాయి. ఇవే పాటలకు గత సంవత్సరం రూ. 3.14 లక్షలు దక్కగా, ఈసంవత్సరం కేవం రూ. 1.94 లక్షలు మాత్రమే దక్కాయి. దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఈఓ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
