సనత్ నగర్ నియోజకవర్గం బిజెపి నేత మర్రి శశిధర్ రెడ్డి కి ముఖ్య అనుచరుడు షేక్ గౌస్ బిజెపిని వీడి దానం.నాగేందర్.. రోహిన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ బేగంపేట్ పార్టీ కార్యాలయంలో షేక్ గౌస్ కి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం తో పాటు అభినందనలు తెలియజేశారు. మహమ్మద్ గౌస్ తో పాటు బిజెపి సీనియర్ నాయకులు. అశ్లాం,సాదిక్, ఖాన్, తన్వీర్, సాయి తదితరుల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటా నిలిమ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసి పార్టీ వీడిన నేతలంతా మరలా సొంతగూటికి చేరుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
