రాహుల్ గాంధీ నీ ప్రధాని చేసే బాధ్యత మన పైనే ఉంది: సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,టిపిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలిమ

సికింద్రాబాద్ పార్లమెంట్ లో దానం నాగేందర్ ను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టి పి సి సి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ అన్నారు. బేగంపేట్ లో గురువారం నిర్వహించిన
బూత్ కార్యకర్తల సమావేశం విజయవంతం పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటా నీలిమ మాట్లాడుతూ తమ కోట్లాట బిజెపి తోనే అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనను ప్రతి ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత బూత్ స్థాయి కార్యకర్తల పైనే ఉందని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ బూత్ స్థాయి కార్యకర్తలతోనే సాధ్యమవుతుందని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *