బిజేపిలోకి పలు కుటుంబాల వలస.

ప్రకాశంజిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి. విజయరావు, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి సంయుక్త నేతృత్వంలో ఒంగోలు నగరంలోని బి పద్మ, ఎస్కె పర్వీన్, భాగ్యలక్ష్మి, సుజాత ల కుటుంబాలు బీజేపీలో చేరడం జరిగింది. వీరికి భాగ్యనగరంలోని బీజేపీ ఎన్నికల కార్యాలయములో జిల్లా అధ్యక్షులు పీవి శివారెడ్డి, యోగయ్య యాదవ్ లు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా పివీ శివారెడ్డి మాట్లాడుతూ బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమి మేనిఫెస్టో ను ప్రజల ముందుకు తీసుకువెళ్లి మన జిల్లాలోని శాసన సభ మరియు పార్లమెంట్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీ తో విజయం సాధించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని మోదీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ఈ సార్వత్రిక ఎన్నికల్లో 400 పార్లమెంటు సీట్లు సాధించే విధంగా మా పార్టీ కార్యకర్తలు అన్ని విధాలా కృషి చేస్తున్నారని, వానిలో భాగంగా ప్రతి డివిజన్ లో తటస్థులను గుర్తించి పార్టీలోకి ఆహ్వానిస్తూ సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో విపక్షాలకు ఓట్లు గణనీయంగా తగ్గించే విధంగా ప్రతి కుటుంబాన్ని బిజెపి ఆహ్వానిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు షేక్. ఖలిఫాతుల్లా బాషా, జిల్లా అధికారప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి బసినేపల్లి రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షురాలు జజ్జర కృష్ణవేణి, బీజేపీ నాయకులు సీతారామయ్య, జిల్లా మహిళా మోర్చా జిల్లా ఇంచార్జి తీగల సత్యవతి బెల్లంకొండ కోటేశ్వరరావు, కుంచాల వెంకట శివ, అల్లరి రామయ్య, గుర్రం రంగనాదం, బాలకోటయ్య, శ్రీనివాసులు, ధనిశెట్టి పావని, ధనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *