దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రూపొందించిన సామాజిక న్యాయం- జగనన్నకే సాధ్యం కరపత్రికను మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఆ సంఘ జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు ఆధ్వర్యంలో కరరపత్రికను ఆవిష్కరించి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లడుతూ దళితులకు ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలను కరపత్రంలో చక్కగా పొందుపరచి ప్రజలకు వివరించేందుకు సమాయత్తమైన జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగయ్యకు బృందాన్ని అభినందించారు. వెంగళరావు మాట్లాడుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసి సుదీర్ఘ పాలన పేద ప్రజల కోసం అందించి, పేదలకు నివాస స్థలాలను ఇప్పించిన గొప్ప నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డిని దళిత, గిరిజన, బహుజన, ముస్లీం, క్రిస్టియన్ సోదరులు వాసన్నను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదేన్న, మాజీ కౌల్సిలర్ కట్టా సుధాకర్, జిల్లా ఎస్సీ సెల్ వైస్ ప్రసిడెంట్ పట్రా బంగారం, ఐక్యవేదిక నాయకులు సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
