గత ఐదేళ్లగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి ఆయనను గెలిపిస్తాయని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. మన ఒంగోలు- మన వాసన్న కార్యక్రమంలో బాగంగా ఆదివారం జయ ప్రకాశ్ నగర్ కాలనీ, చైతన్య కాలనీలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధికి గురించి ప్రజలకు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అగ్రకులాలోని పేదలను ఆదుకున్నారన్నారు. మేలు పొందిన వర్గాల వారంతా మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అందువల్లనే మునుపెన్నడూ లేని విధంగా మేమంతా సిద్ధం సభలకు, బస్సు యాత్రలకు ప్రజలు తరలివెళ్లి సీఎం వైస్ జగన్ను ఆశీర్వదిస్తున్నారని అన్నారు. ఒంగోలు ప్రజలు కూడ తాను చేసిన అభివృద్ధి. సంక్షేమాన్ని గుర్తించి వివరించారు. డివిజన్లో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధిని కొనసాగుతున్న అభివృద్ధిపూర్తి కావాలంటే తనను బలపరచాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించామని చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా టిడిపి నేతలు ఎన్నో కుట్రలు పన్నినా నగరంలో 25వేల ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రతి ఒక్కరి ఇల్లు కట్టిస్తానని భరోసా
కల్పించారు. ఎన్నికలలో మరోకసారి టిడిపికి బుద్ధి చెప్పాలని తనను, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతి నివాసంలో వారికి ఒంగోలులో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కర పత్రాలను అందించారు. డివిజన్లోని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్న ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదేన్న, రాష్ట్ర నాయకుడు గొర్రెపాటి శ్రీనివాసరావు, డివిజన్ కార్పోరేటర్ ఏ ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు, జె సురేష్, 44వ డివిజన్ కార్పోరేటర్ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, మాజీ డివిజన్ అధ్యక్షుడు గల్ల దుర్గా, డివిజన్ మహిళా నాయుకురాలు జల్లిపల్లి సుబ్బులు, రజని, మంజుల, అనిత, చంద్ర, లక్ష్మణ రావు, విశాఖ్, అజయ్, ఏడుకొండలు, కోటి, రాజు, దుర్గా, చక్రపాణి, డి ప్రభాకర్, రవి, బేతంపూడి భాస్కరావు, మారుతి, వేణు, నరేష్, శ్రీరామ్, రాజ, కండే రాములు, మణికంఠ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.





