వైఎస్ జగనన్న మాట ఇచ్చారంటే ఎంత కష్టమొచ్చినా నెరవేర్చి తీరుతారని, అలాంటి నాయకుడిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యర్థించారు. పట్టణంలో పలు డివిజన్లలో గురువారం ప్రచారం నిర్వహించి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస రెడ్డిని, ఎంపీగా చెవిరెడ్డి బాస్కర్ రెడ్డిని గెలిపించుకుందామని కోరారు. 49వ డివిజన్ పరధిలో గురువారం వైఎస్సార్సీపీ బలపరచిన ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారానికి శ్రీకారం చుట్టారు. డివిజన్ ఇన్చార్జీ తాళ్లపాలెం శ్రీనివాసరావు, కార్పోరేటర్ అంగరేకుల గురవయ్య, డివిజన్ అధ్యక్షుడు గాలం సుబ్బారావు, నాయకులు కసిబిసి నాగేశ్వరరావు, సూరసారి నర్సా రెడ్డి, బత్తుల కాశయ్య, ఢాకా రాఘర రెడ్డి, మల్లిఖార్జున్,జయరాం, షేక్ గౌస్ నాయబసూల్, అంగిరేకుల నాగేశ్వరరావు, కుర్ర గురు సత్యం, మళ్లీబోయిన వెంకటేష్ తదితరులు పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

