- రెండు దశాబ్దాలుగా ఈ రంగంలో సమగ్ర చికిత్సలు
- పలువురు సీనియర్ కంటివైద్య నిపుణుల ప్రశంసలు.
- ఆస్పత్రి ఆధ్వర్యంలో కొత్త వైద్యులకు సీఎంఈ శిక్షణ.
- రాష్ట్రవ్యాప్తంగా 300 మందికి పైగా కంటి వైద్యుల హాజరు.
కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి వైద్య సేవలు ఆరంభించి రెండు దశాబ్దాలు అయ్యిందని, ఆస్పత్రి ఆఫ్తల్మాలజీ విభాగానికి చెందిన సీనియర్ క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ బి. ప్రణతి అన్నారు. తీవ్రమైన గుండెవ్యాధులు, ఊపిరితిత్తులు సమస్యలు ఉన్నవారికి క్యాటరాక్ట్ లాంటి శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు అన్ని విభాగాల వైద్యులు, మత్తువైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉండటం వల్ల కిమ్స్ ఆస్పత్రికే అలాంటి కేసులన్నీ వస్తున్నాయని, అలాంటి వారికి అద్భుతమైన నైపుణ్యంతో చికిత్సలు చేసి నయం చేస్తున్నారని తెలిపారు. కిమ్స్ హాస్పిటల్ మరియు హైదరాబాద్ ఆఫ్తల్మాలజీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం సీఎంఈ (కంటిన్యువస్ మెడికల్ ఎడ్యుకేషన్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి వచ్చిన
సీనియర్ కంటి వైద్యులు పాల్గొన్నారు. కొత్తగా కంటి ఆస్పత్రులు ఏర్పాటు చేయాలనుకునే వైద్యులకు శస్త్రచికిత్సలలో నైపుణ్యాలు, క్లిష్టమైన కేసుల్లో ఎలా చికిత్స చేయాలన్న విషయాలతో పాటు. ఆర్థికపరమైన క్రమశిక్షణ, అనుమతులు తదితర వివరాలను ఈ సందర్భంగా సమగ్రంగా వివరించారు.
రిఫ్రాక్టివ్ సర్జరీలు,
క్యాటరాక్ట్ సర్జరీలలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, సంక్లిష్టమైన కేసులకు శస్త్రచికిత్సలు చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు తదితర అంశాలపై పలువురు వైద్య నిపుణులు క్షుణ్ణంగా వివరించారు. క్యాటరాక్ట్ సర్జరీలలో అలాగే, కంటి ఆస్పత్రి ఏర్పాటుకు అవసరమైన అనుమతులు,వాటిని ఎలా పొందాలి అనే విషయాలనూ చెప్పారు. అనంతరం ఆస్పత్రులు ఏర్పాటుచేసేటప్పుడు పాటించాల్సిన ఆర్థిక క్రమశిక్షణ, ఆదాయాలను జాగ్రత్తగా గమనించుకోవడం ఎలా అనే విషయాలపై ఎకౌంట్స్ విభాగం వారితోనూ శిక్షణ ఇప్పించారు.
కిమ్స్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు జ్యోతి ప్రజ్వలనం చేసి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కిమ్స్ ఆస్పత్రి ఆఫ్తల్మాలజీ విభాగానికి చెందిన సీనియర్ క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ బి. ప్రణతి, హైదరాబాద్ ఆఫ్తల్మాలజీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ప్రొఫెసర్ డాక్టర్ మోదినీ పండార్‌పూర్కర్ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా వ్యవహరించారు. దృష్టి ఐ సెంటర్‌కు చెందిన డాక్టర్ మధుకర్ రెడ్డి, సరోజినీదేవి కంటి ఆస్పత్రికి చెందిన డాక్టర్ రామన్ తదితరులు పాల్గొని యువ వైద్యులకు కావల్సిన మార్గదర్శకాలను అందించారు.

