ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని కేవలం ప్రతిపక్ష కూటమి నాయకులు రాజకీయ దురుద్దేశం తో దుష్పచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బా రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 1989 నుంచి అమలు చేసేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని అన్నారు. అన్ని రాష్ట్రాలలో దీనిని మలు చేయాలంటూ ప్రస్తుత బిజేపి ప్రభుత్వం కూడ ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయటం లేదన్నారు. బిజేపి ప్రభుత్వం మన రాష్ట్రంపై కూడ ఒత్తిడి తీసుకుని వస్తున్నప్పటికి, నిరంతరం రైతుల సంక్షేమాన్ని కాంక్షించే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర రెవిన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడ పత్రికా ముఖంగా స్పష్టం చేసిన విషయాన్ని మారెడ్డి సుబ్బారెడ్డి గుర్తు చేసారు.
ఆదరణ చూసి ఓర్వలేకే ….. వైఎస్సార్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజా దరణ చూసి బెంబేలెత్తు పోతున్న ప్రతి పక్ష పార్టీ నేతలు కేవలం బురద జల్లె ప్రయత్నాలలో బాగంగానే అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రస్తుతం న్యాయస్థానం పరధిలో ఉందన్నారు. దీనిని అమలు చేయని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ సమర్పించిందన్నారు. ప్రస్తుతం ఈ యాక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ‘ కెప్ట్ ఇన్ పెండింగ్’ పెట్టిందన్నారు. కార్డు -2 వెర్షన్ ఆపడేషన్లో భాగంగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఒక మోమోను జారీ చేసిందన్నారు. దాని ప్రకారం 16 సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో 135 డాక్యుమెంట్లను ఒక డమ్మీ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారన్నారు. దీని అమల్లో లోపాలను తెలుసుకునేందుకు కేవలం డమ్మీ సాఫ్ట్ వేరు అభివృద్ధి పరచారన్నారు. దీన్ని కూడ ప్రతి పక్ష నాయకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు ముడిపెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. దీనిపై ఫెక్ వీడియోలు సృష్టించి ప్రభుత్వంపై దుష్పచారం చేస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. రైతులు ఈ విషయాలను గమనించాలన్నారు. ల్యాండ్ టైటిలింగ్యార్డ్ను అమలు చెయాలని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలను వెల్లడించినటుల కొద్ది రోజుల క్రితం బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి బాగస్వామి పురందేశ్వరి తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు. మన రాష్ట్రంలో ఈ చట్టం అమల్లోకి రాలేదని కూటమి సభ్యురాలు పురందేశ్వరి వెల్లడించిన విషయాన్ని గమనించాలని సూచించారు. ఫెడ్ వాయిస్ కాల్స్, వీడియోలు నమ్మవద్దని, రైతన్నల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన అనేక మేళ్లు గమనించాలని రైతన్నలకు విజ్ఞప్తి చేసారు.
