తాళ్లూరు మండ లంలోని బొద్దికూరపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రకాశం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రగ్బీ సమ్మర్ కోచింగ్ సెంటర్ ను రగ్బీ ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ ఎస్.చంద్రశేఖరరావు బుధవారం రగ్బీ సమ్మర్ కోచింగ్ ను ప్రారంభించారు. కోచింగ్ క్యాంపులో ఆశక్తి ఉన్న పదేళ్ల వయసు నుంచి పదహారేళ్ల వయసు యువకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. రోజూ ఉదయం ఐదన్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు కోచింగ్ ఇవ్వనున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్.రవిప్రసాద రెడ్డి తెలిపారు. ఆశక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జి.రా జేశ్వరి, విశ్రాంత ఉపాధ్యాయులు పి.సుబ్బారావు, ఎస్.అంజిరెడ్డి తెలిపారు.
