బేగంపేట ఫ్లై ఓవర్ పైన కారును ఢీ కొన్న ప్రయివేటు బస్సు -ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా తొలగించిన ట్రాఫిక్ పోలీసులు

బేగంపేట ఫ్లై ఓవర్ పైన కారును బస్సు డీ కొన్న ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది . సమాచారం మేరకు వివరాలు ఇలా వున్నాయి….అమీర్ పేట వైపు నుంచి బేగంపేట వైపు వస్తున్న కారును వెనుక నుంచి వస్తున్న ప్రయివేటు బస్సు డీ కొంది. ఈ ఘటన లో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.ఇది గమనించిన వాహనదారులు డయల్ 100 కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ప్రమాద స్థలం నుంచి తొలగించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాక పోవడం తో అంతా వూపిరి పీల్చు కున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *