గ్రామాల్లో ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు సకాలంలో అందేలా చూడాలని ఎంపీడీఓ యుగకీర్తి అన్నారు. తాళ్లూరు మండలంలోని బెల్లంకొండవారిపాలెం, లక్కవరం గ్రామాల్లో గురువారం వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కే యు కీర్తి మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడా లన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమ తులు అందజేశారు. సర్పంచ్ పోశం సుమలతా శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ గూడా సరస్వతీ ప్రభాకర రెడ్డి, ఎంఈఓ సుబ్బయ్య, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

