దేవదాయశాఖ ఉన్నతాధికారుల విధులకు ఆటంకంకల్గించటంతో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గుంటిగంగాభవానీ దేవస్థాన ఉప అర్చకులు ఏ సాంబశివరావును విధుల నుంచి తొలగిస్తూ ఆలయ ఈవో పి.కార్తిక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమ్మవారికి నిత్య పూజా కార్యక్ర మాలు చేయనందుకు, భక్తులకు ఆటంకం కలిగించి, సిబ్బందిని వారి విధులను చేయకుండా ఇబ్బంది పెట్టినందుకు, అనుమతి లేకుండా గత నెల 25 నుంచి 27వ తేదీవరకు విధులకు గైర్హాజరు కావటంత పాటు, రెండు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వనందు వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో కార్తీక్ తెలిపారు.
