ఒంగోలు మండలం కరవధి గ్రామంలో వెంచేసి యున్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గల శ్రీ గోదాదేవి కి ధనుర్మాస మూడవశుక్రవారం సందర్భంగా ఫలాలతో చేసిన అలంకారం భక్తులను విశేషంగాకర్షించింది
ఉదయం పంచామృత అభిషేకం అనంతరం వివిధ రకాల ఫలాలు డ్రై ఫ్రూట్స్ తో గోదాదేవికి చేసిన అలంకారం భక్తులను తన్మయత్వంలో ముంచెత్తింది. ప్రత్యేక అర్చన, మంగళ హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. దేవస్థాన ఈవో వి శ్రీనివాస్, దేవాలయ ప్రధాన అర్చకులు నారాయణ 0 రఘు ప్రదీప్, సాయి వివేక్, మహిళా భక్త బృందం పాల్గొన్నారు.
