కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని శనివారం కూకట్‌పల్లిలోని ఎన్.కే.ఎన్.ఆర్ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలను నెరవేర్చకుండా పాలన సాగిస్తున్నదని అన్నారు. తాము వంద రోజుల పాటు వేచి చూస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. ఫ్రీ బస్ పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ సరైనన్ని బస్సులు లేకుండా పథకం అమలు చేయటం వల్ల బస్సులలో ప్రయాణించే మహిళలు, పురుషులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఫ్రీ బస్ పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రోజు వరకు 16 మంది ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రతి నెల పదివేల రూపాయలు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించాలంటే రానున్న ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని కోరారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ…. ఈనాడు కూకట్పల్లి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో తాను గెలిచాను అంటే దానికి కేటీఆర్,నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి ,సంక్షేమమే ముఖ్య కారణమని అలాగే ఎంతో నిబద్ధతతో పనిచేసే కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే నాకు అండగా ఉండి ఇంత మెజారిటీ సాధించడానికి కృషి చేశారని వారిని ఎప్పటికీ మర్చిపోనని.. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గానికి గతంలో పదవుల పంపకం విషయంలో కొంత అన్యాయం జరిగిందని భవిష్యత్తులో కూకట్పల్లి నియోజకవర్గంకు పెద్దపీట వేయాలని కోరగా దీనికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు… అలాగే ఎంతో విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ అని భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనని అన్నారు.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంబిపూర్ రాజు.. కూకట్పల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా.. నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



