పశువులకు మేత గా ఉపయోగించే పంటలను పశుగ్రాసాలుగా చెప్పు వచ్చు.వీటిని మనం పొలాల్లో సాగు చేయటమే కాకుండా, అడవి జాతి కి చెందిన మొక్కలను కూడా ప్రశుగ్రాసాలుగా వాడుతూఉంటాము. పశువులకు మేతగా ఉపయోగపడే పంటలలో దాన్యపుజాతి, గడ్డి జాతి మరియు పప్పు జాతి పంటలు ముఖ్యమైనవి అని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. లీలా కృష్ణ తెలియజేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో పశుపోషణ మరియు పశుగ్రాస పెంపకంపై రైతులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమము తాళ్లూరు మండలం దారం వారి పాలెం గ్రామ రైతు భరోసా కేంద్రం నందు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంచాల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ మంచి పశుగ్రాసాలను అధిక ఉత్పత్తితో పండించాలంటే వాటి యొక్క ముఖ్యమైన రకాలతో పాటు పండించే పరిస్థితులు, యాజమాన్య పద్ధతులు రైతులు తెలుసుకోవాలని ఆయన తెలియజేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజనల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ పశు పోషణలో సామాజిక అడవుల పెంపకం, పశుగ్రాసం కొరకు వాడు చెట్లు పెంపకం ఇటీవల కాలంలో చాలా ప్రాధాన్యత వస్తున్నది. ఈ పశుగ్రాసం కొరకు పొలం గట్ల పైన కాలు గట్ల పైన మరియు ఫైర్లను సాగు చేయడానికి పనికిరాని భూములలో పెంచవచ్చునని దాని ద్వారా పాడిలో అధికబడి తీసుకోవచ్చని ఆయన తెలియజేశారు. గ్రామ పశు వైద్య సహాయకుడు ఎం. రాజేష్ మాట్లాడుతూ పశుగ్రాసం చెట్లను పెంచడం వలన పశువులు,మేకలు, గొర్రెలు పెంపకంలో తానా ఖర్చు తక్కువ చేయవచ్చును. ఇవి కాకుండా పప్పు జాతి చెందిన క్రాసమును పెంచుకొనుట ద్వారా పాల దిగుబడే అధికారం అధికంగా తెచ్చుకొని కొనవచ్చునని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి బి ఆర్ సి ఏరియా కో-ఆర్డినేటర్ గోపనబోయిన వెంకట్రావు, గ్రామంలోని పశు పెంపక రైతులు పాల్గొన్నారు.

