ఆర్ డబ్ల్యూఎస్ పనుల నిర్వహణపై సభ్యుల ఆగ్రహం-మా సహకారం లేకుండా అభివృద్ధి ఎలా ..? -రైతులకు పంట నష్ట పరిహారం చెల్లింపులో జాప్యంపై నిలదీత -వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నందున ఉపాధి పనుల లక్ష్యంపై ఒత్తిడి తేవద్దు అని అధికారులకు సూచన

గ్రామాల్లో ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు ప్రజా ప్రతినిధుల సహకారం లేకుండా అధికారుల కమిటీలతో చేపడితే పనులు ఎలా ముందుకు సాగుతాయని, పనులు సవ్యంగా ఎలాజరుగుతాయని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు,జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులను నిలదీశారు. తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన ఎంపీడీవో కేవై యుగకీర్తి ఆద్వర్యంలో మం డల పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఆర్డబ్ల్యుఎస్ శాఖ పరిధిలో మంజూరైన నిధులు, పనుల వివరాలను ఏఈ వాలి వివరిస్తుండగా…. పనులు ఎవరి పర్యవేక్షణలో జరుగుతాయని ఎంపీపీ, జడ్పీటీసీలు ప్రశ్నించారు. పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామాల్లో పనులు చేపట్టే సమయంలో ఏవైనా అభ్యంతరాలు వస్తే పరిష్కరించేందుకు ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు. గతంలో నాడు-నేడు ద్వారా చేపట్టిన పనులు కూడా అధికారుల కమిటీలవల్ల పలు పాఠశాలలో పనులు పూర్తి కాకపోగా ప్రభు త్వం నుంచి విడుదలైన సిమెంట్ గడ్డకట్టిపోగా, ఇనుము తుప్పు పట్టి ప్రజా ధనం వృథా అయిందని సభ్యులు నిలదీశారు. విఠలాపు రం సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ… గ్రామాల్లో చేపట్టే పనులకు సర్పంచ్నెల తో కూడిన కమిటీలతో చేయిస్తే త్వరితగతిన పూర్తవుతాయన్నారు. దీనిపై ఎంపీడీవో కీర్తి మాట్లాడుతూ… తమ చేతుల్లో ఏమీ లేదని, ప్ర భుత్వం చేపట్టిన పాలసీ మేటర్ ప్రకారం నడు చుకోవాలన్నారు. ప్రజాధనం వృథాకాకుండా ప నులు చేయించాలని సభ్యులు ఎంపీడీవోకుసూచించారు. పంట నష్టపరిహారం కొంత మం
ది రైతులకు అందలేని, పలుమార్లు అధికారందృష్టికి తీసుకెళ్లినా ఎందుకు అందడం లేదని సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి ఏవో ప్రసాద్ రావు ని ప్రశ్నించారు. వెంటనేన్యాయం చేయాలన్నారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో జాప్యంపై సర్పంచ్ లుమారం ఇంద్రసేనారెడ్డి, మంచాల వెంకటేశ్వరరెడ్డి, సభ్యులు విద్యుత్ ఏఈని నిలదీశారు. మల్కాపురం గ్రామంలో జగనన్న ఇళ్ల కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లపై విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉ న్నాయని సర్పంచ్ షేక్ కాలేషావలి అన్నారు. ఇళ్లనిర్మాణాలు, బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై సభ్యులు హౌసింగ్ ఏఈని ప్ర శ్నించగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరులో ఆలస్యం జరుగుతున్నదని త్వరలోవిడుదల అవుతాయని ఏఈ కోటిరెడ్డి తెలిపారు. పలుశాఖలపై చర్చ నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉపాధి కింద చేపట్టే రైతువారీ పనులకుప్రాధాన్యత నివ్వాలని, ప్రస్తుతం వ్యవసాయపనులు ముమ్మరంగా ఉన్నందున ఉపాధిపనులు వేగవంతం చేయాలని, సంఖ్యలో కూలీలు పాల్గొనాల చూడాలని ఒత్తిడి స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లు పై చేయవద్దని , ఇలా చేస్తే రైతులకు కొంతమేర నష్టం జరుగుతుందని అధికారులకు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, వైస్ఎంపీపీలు ఐ.వెంకటేశ్వరెడ్డి, మంచాల ప్రియాంక, మండల కోఆప్సన్ కరిముల్లా, వైద్యుడు శ్రీకాంత్ రెడ్డి, రాజేష్, పశువైద్యాధికారి రాంబాబు, ఎంఈఓ సుబ్బయ్య, వ్యవసాయాధికారి బి.ప్రసాదరెడ్డి, సీడీపీవో సీహెచ్.భారతి, ఈవోఆర్డీ కేజేఎస్ రాజు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *