మంచి నైపుణ్యంతో క్రీడల్లో రాణించడం అభినందనీయమని నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శి లోని బూచేప ల్లి నివాసంలో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో ప్రథమ స్థానం పొందిన తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెం టీంను ఆదివారం అభినందించారు. వారికి రూ.25వేలు ఆర్థిక సాయం అందించారు. దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు దర్శి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. నాగంపట్ల వారి పాలెం సర్పంచ్ సుబ్బారావు, జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ మెంబర్ అనీల్ రెడ్డి పాల్గొన్నారు.

