ఒంగోలు నగరంలో భారతీయ జనతా పార్టీ జెండాల ఆవిష్కరణ

భారతీయ జనతా పార్టీ రాష్ట్రఅధ్యక్షురాలు దగ్గు బాటి పురందేశ్వరి పిలుపు మేరకు… పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ ఛార్జి యోగయ్య యాదవ్ ఆధ్వరంలో ఒంగోలు పట్టణంలోని పది ప్రాంతాల్లో 18 అడుగుల ఎత్తులో పార్టీ జెండాలు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ప్రదర్శనగా వెళ్తూ ఆయా ప్రాంతాల్లో వీటిని ఆవిష్కరించారు. ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ యోగయ్య యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పీవీ శివారెడ్డి మాట్లాడుతూ… ప్రధాని నరేంద్రమోదీ అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలన కారణంగా వచ్చే ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ కి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పీవీ శివారెడ్డి , అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు ,పార్టీ నాయకులు నాశ్వరరావు, శివాజీ యాదవ్, సెగ్గం శ్రీనివాసరావు, తోగంటి శ్రీనివాసరావు, గుర్రం రంగనాథ్, ఎల్. సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *