ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్న -జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు వందకు వంద శాతం నెరవేర్చుకున్నారని జిల్లా పరిషత్ చైర్ప ర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి కొనియాడారు. దొనకొండ మండలంలోని చందవరంలో సోమవారం రాత్రి మన ఊరికి మన శివన్న కార్య క్రమం జరిగింది. తొలుత అంకాల పరమేశ్వరి ఆలయంలో వారు పూజలు చేశారు. గ్రామస్తులు పూలు చల్లుకుంటూ వారికి స్వాగతం పలికారు. చందవరం, బట్టేపాడు, ఎస్సీ కాలనీ, దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని పురవీధుల్లో తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ ..మండలంలోని చంద వరం నుంచి మన ఊరు మన శివన్న కార్యక్రమం చేప ట్టామని, నా బిడ్డ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్మునిగా భావించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరింది. చందవరం గ్రామంలో పాఠశాలలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా తాము చైర్మన్ అయిన తర్వాత నిధులు కేటాయించి నూతన తరగతి గదులు నిర్మించామని, గతంలో విద్యార్థులు చదువుకో వడానికి ఇబ్బందులు పడేవారని, అలాంటి సమస్య నేడు లేదని ఆమె గుర్తు చేశారు. శివన్న మాట్లాడుతూ 2004లో మా నాన్నగారిని, 2009లో తనను చంద వరం గ్రామస్తులు అధిక మెజార్టీతో గెలిపించారని, వారికి మేము రుణపడి ఉంటామన్నారు. చందవరం గ్రామానికి రూ.20 కోట్లు సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందించిందన్నారు. మీ శివన్న మీ దగ్గరికి వస్తున్నాడు, మీ తమ్ముడు అనుకుంటారో, అన్న అను కుంటారో 2024లో తనను అధిక మెజార్టీతో గెలిపిం చాలని ప్రార్థించారు. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లుదళారి వ్యవస్థ ఉండి ప్రజలు, రైతులు చాలా ఇబ్బంది పడే వారని, అలాంటి సమస్య లేకుండా ముఖ్యమంత్రి జగనన్న వారి ఖాతాల్లో జమ చేస్తున్నారని, అలాంటి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. నవరత్నాల్లో మహిళలకు నూటికి నూరు శాతం హామీలు పూర్తి చేసిన ఘనత మన జగ నన్నదే అన్నారు. రాజన్నకు పులి లాంటి జగనన్న, బాబుకు పప్పు లాంటి లోకేష్ పుట్టాడని ఎద్దేవా చేశారు. లోకేష్ మంగళగిరి చెత్తగా ఓడిపోయి ఎమ్మెల్సీ సీటు పొంది దొడ్డి దారిన మంత్రి అయి, మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అబద్దాలు మాట్లాడుతూ మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి రావటం సిగ్గుచేటన్నారు. మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన న్నను రానున్న ఎన్నికల్లో గెలిపించుకుందామంటూ పిలుపునిచ్చారు. శివన్న సతీమణి నందిని, కాపా రమ ణారెడ్డి, ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళి, మాజీ కన్వీ నర్ కాకర్ల కృష్ణారెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, సర్పంచ్ వజ్రగిరి రాణి సొలోమన్, ఎంపీటీసీ బండారు రాజు, పిల్లి ఓబులరెడ్డి, దగ్గుల వెంకటేశ్వరరెడ్డి, డి. చెంచిరెడ్డి, ఎగ్గోని కృష్ణారెడ్డి, వై. నాగేశ్వరరావు, దేశిరెడ్డి వెంకటేశ్వ రరెడ్డి, గుమ్మా వెంకటేశ్వర్లు, గుంటు పోలయ్య, కోఆప్షన్ షేక్.గఫార్, ఇమ్రాన్ఫాన్, గోనె జాకోబు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *