పార్టీ విజయానికి మహిళా శక్తి అవసరం – పీవీ శివారెడ్డి -మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఎన్జీవో సంపర్క అభియాన్.

రాబోవు ఎన్నికల్లో మహిళల పాత్ర కీలకంగా ఉంటుందని ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలను, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లే బాధ్యత మహిళలపై ఉన్నదని మహిళలు వారి వారి నియోజకవర్గాల పరిధిలో కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను ముందుగా మహిళలకు తెలిపి తద్వారా బిజెపి వైపుకు ఆయా కుటుంబాల వారిని ఆకర్షితులను చేయాలని బిజెపికి ఓటు వేసే విధంగా వారిలో మార్పు తేవడానికి కృషిచేయాలని భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సోమవారం రాష్ట్రస్థాయి మహిళా మోర్చా నాయికలు జిల్లా పర్యటనలు చేస్తూ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మహిళా మోర్చా నాయికలతో శక్తి వందన్ మహిళా స్వయం సహాయక సంఘం ఎన్జీఓ సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వారు ప్రసంగించారు. నగరానికి విచ్చేసిన రాష్ట్రస్థాయి నాయికలను సత్కరించారు.

కార్యక్రమంలో రాష్ట్ర మహిళ మోర్చా సోషల్ మీడియా ఇంచార్జీ గాయిత్రి, రాష్ట్ర ఎన్జీఓ సంపర్క అభియాన్ కె.మాధవి, మహిళా మోర్చా జోనల్ ఇంచార్జీ లక్ష్మి మరియు జిల్లా ఉపాధ్యక్షులు జజ్జర కృష్ణ వేణి, మహిళా మోర్చా జిల్లా ఇంచార్జి తీగల సత్యవతి, జిల్లా కార్యదర్శి జువ్విగుంట కోటేశ్వరి, మద్దినేని లక్ష్మి దేవి, శివకుమారి, విజయ రావు, శ్రీలక్ష్మి. అజంతా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *