రాష్ట్రం లో రాహుల్ ప్రియాంకా గాంధీ సేన కాంగ్రెస్ ను రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని,రాహుల్ ప్రియాంకా గాంధీ సేన కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజ్ అన్నారు. మంగళ వారం బేగంపేట పాటిగడ్డ లోని తన కార్యాలయం లో .ములుగు జిల్లా డీ సీ సీ అధ్యక్షులు అశోక్ పటేల్ తో కలిసి ఫయాజ్ మాట్లాడుతూ రాష్ట్రం లో ఇటీ వల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కాంగ్రెస్ కార్య కర్తలు,నాయకులు ఎంతగానో కృషి చేశారని అన్నారు.కేంద్రం లో కూడా రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై చూడాలని ప్రతి కాంగ్రెస్ కార్య కర్త కోరుకుంటున్నారని అన్నారు.ఈ కార్య క్రమం లో ముజమీల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
