ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలి- తాళ్లూరు మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు

ప్రకృతి సమతుల్యతకు జీవ వైవిద్యం ఎంతో అవసరమని మండల వ్యవసాధికారి బి.ప్రసాదరావు తెలి పారు. తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరంలో బుధవారం రైతు భరోసా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఐసీఆర్పీలకు అవగాహనకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో ప్రసాదరావు మాట్లాడుతూ …భూతాపాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ విసృం తంగా మొక్కలు నాటాలన్నారు. తేనె టీగలను కాపాడుకుంటే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. అధిక రసాయనాలు వాడటం, విచక్షణారహితంగా పురుగు మందులు వాడితే ప్రకృతి సమ తుల్యత దెబ్బతింటుందన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించి సాగు చేసేలా రైతు లను చైతన్యం చేయాలన్నారు. నేల, నీరు, గాలి, వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవాలన్నారు. వేసవిలో సాగుకు నవధాన్యాల కిట్లు, పచ్చిరొట్ట ఎరువులపై అవగాహన కల్పిం చారు. ప్రకృతి సాగు డీఎల్ఎం పి.సత్యనారాయణ, మండల అధికారి నరసింహులు, ఐసీఆర్పీలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *