30 న స్టెప్ ఆధ్వర్యంలో ఉచిత వక్త శిక్షణ తరగతులు

స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్, పేరంట్స్ (స్టెప్) ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి రెండో రోజుల పాటు ఉచిత వక్త శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు స్టెప్ జిల్లా కార్యదర్శి ఎం. ధనరాజ్ తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని నెక్కేళ్లు లోని శ్రీ రమణరావు, సావి త్రమ్మ ధ్యాన ఆరోగ్య ఆశ్రమంలో తరగతులు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. శిక్షణలో పాల్గొనేవారికి ఉచిత వసతి, భోజనం, మెటీరియల్ కూడా ఉచితంగా అందజేస్తారన్నారు. శిక్షణ తరువాత సర్టిఫికెట్ ఇస్తారన్నారు. ఆసక్తి కలిగిన అభ్య ర్థులు 29వ తేదీ సాయంత్రంలోపు వేదిక వద్దకు హాజరుకావాలని, పూర్తి వివరాలకు 9491710716 నంబర్ కు ఫోన్ ద్వారా సం ప్రదించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *