స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి రామతీర్థం రిజర్వాయర్లో యువకుడు గల్లంతయ్యారు. తాళ్లూరు మండలంలోని రామభద్రాపురంకు చెందిన యాతం వెంకటేశ్వరరెడ్డి కుమారుడు మణికంఠ(22) ఆదివారం ఉదయం స్నేహి తులతో కలిసి వెలుగువారిపాలెం సమీపానగల రామతీర్థం రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. అందరూ కలిసి ఈత కొట్టేందుకు దిగగా, మణికంఠ గల్లంతయ్యాడు. ఎంతకూ బయటకు రాకపోవటంతో ఆందోళన చెందిన స్నేహితులు కొంత సేపు వెతికారు. రిజర్వాయర్ లో నీరు లోతుగా ఉండటంతో కన్పించలేదు. దీంతో వారు సమాచారాన్ని కుటుంబసభ్యులకు చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వెలికితీ సేందుకు గజ ఈత గాళ్లను తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుడు తూర్పుగంగవరంలోని ఓషాపులో పనిచేస్తున్నాడు. మృతుడు అవివాహితుడు. మృతునికి తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు.

