గుంటి గంగ భవాని వద్దసామూహిక సుమంగళి పూజలు నిర్వహణ

పవిత్ర పుణ్యక్షేత్రమైన గుంటిగంగలో దేవదాయ, ధర్మాదాయశాఖ నూతన ఒరవడితో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్ర మాలు చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం అమ్మవారి ఆలయంలో సామూహిక సుమంగళి పూజలు నిర్వహించారు. పలుగ్రామాలకు చెందిన 16 మంది దంపతులు పూజలు నిర్వహించారు. ఇతరప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పూజా కా ర్యక్రమాలను తిలకించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్ర మంలో కమిటీ చైర్మన్ గురుబ్రహ్మం ,ఈవో పీ కార్తీక్ , ఆర్.ఏ శ్రీనివాసరావు అర్చక పూజారులు కామేశ్వరశర్మ, ప్రకాష్ పంతులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *