రైతులు భూసార పరీక్షల పై అవగాహన పెంచుకోవాలి -దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఎస్సీ రైతులకు భూసార పరీక్షల పై అవగాహన కార్యక్రమం నిర్వహణ

భూమి అనేది ఒక మిశ్రమ సమ్మేళనం దీనిలో ఖనిజ లవణాలు పోషకాలు ఉంటాయి. ఇవి భూమిలో నిలువ ఉండటం వలన భూమిని పోషక కేంద్రo భావిస్తారు. ప్రస్తుతం భూమిలో సారవంతం లేకపోవటం రైతులు భూమిలో ఏమి పంటలు వేసుకున్న దిగుబడులు రాకపోవడం భూమి పోషక లోపం జరుగుతుంది. అందులకు ప్రతి ఒక్క రైతు భూసార పరీక్షలు చేయించుకొని భూమిలో ఉన్న లోపాలు తెలుసుకున్నప్పుడే పైర్లలో అధిక దిగుబడి తెచ్చుకొనవచ్చునని. తాళ్లూరు మండలం లక్కవరం గ్రామ వ్యవసాయ సహాయకులు కె. వీరాంజనేయులు తెలియజేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఎస్సీ రైతులకు భూసార పరీక్షల పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజనల్ కో- ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరావు మాట్లాడుతూ భూసార పరీక్షల ద్వారా నేలలు వాటిలోని సహజంగా ఉన్న పదార్థాలతోపాటు, సేంద్రియ మరియు రసాయనిక ఎరువులు అందజేసినప్పుడు పంట దిగుబడికి దోహదపడతాయని.తద్వారా రైతులు అధిక దిగుబడి తెచ్చుకోవచ్చని ఆయన తెలియజేశారు. తదుపరి ఎస్సీ రైతుల పొలాలలో మట్టి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల కు పంపడం జరిగినది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *