జిల్లా స్థాయి రగ్బీ బాలబాలికల జట్లను
గురువారం తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేశారు. శిక్షణ అనంతరం రాష్ట్ర స్థాయి పోటీల్లో తలపడే జట్లను ఎంపిక చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లా స్థాయి జట్టు ఎంపిక ప్రక్రీయలో భాగంగా 10 నుంచి 16 ఏళ్ల వయసు గల విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్. రవిప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి శిక్షణ 1 శిబిరం నిర్వహించారు. ఎంపిక చేసిన జట్లు భీమిలిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జూనియర్ రగ్బీ పోటీల్లో పాల్గొంటాయని వ్యాయామ
ఉపాధ్యాయుడు తెలిపారు. – బాలుర జట్టులో జి. కుమార్, శివరామకృష్ణ, పి.హేమంత్, కె.నందకిషోర్,ఎస్ హుస్సేన్బాషా, కె.మనోహర్, కె.షాట్రిక్, యు.తేజ, జె.ఇజ్రాయిల్, ఎం రామ్ చరణ్ , ఎం.అభి, – ఎస్. జాన్పాల్, బాలికల జట్టులో పి.కోమలి, పి.చం ‘దన, పి.అలేఖ్య, సీహెచ్ శిరీష, జి.సాక్షి, సీహెచ్ అఖిలప్రియ, పి.రక్షిత,పి.అమృత….కు చోటు దక్కిందని రగ్బీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవిప్ర సాదరెడ్డి, కార్యదర్శి ఎస్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఎంపికైన జట్టుకు రిటైర్డ్ హెడ్మాస్టర్ ,ఉత్తమ రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎస్ అంజిరెడ్డి , గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు.
