ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని కాపాడండి.

ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలని,పర్యావరణాన్ని కాపాడాలని బేగం పేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏ సి పి జి శంకర్ రాజు పిలుపు నిచ్చారు.అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఏ సీ పి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ….భావితరాలకు మనం అందించవలసిన గొప్ప సంపద ప్రకృతి అన్నారు.భూమి మనకు తెలిసిన ఏకైక ఇల్లు. మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఈ భూమి మనల్ని పోషించి, ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తుందన్నారు.మనకు జీవించడానికి,అవసరమైన అన్ని వనరులను అందిస్తుందన్నారు. శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటికీ, ప్రకృతి మనకు అన్నిటికంటే ఉత్తమమైన వాటిని అందిస్తుందన్నారు. అయితే, మానవజాతి ప్రకృతి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుందన్నారు.మానవుడు సహజ వనరులను నిర్వీర్యం చేసాడనీ, అడవులను నరికి వేస్తుండటం తో పరిణామాలు కాలుష్యం మరియు గ్లోబల్ వార్మింగ్కు దారితీశాయాన్నారు మళ్లి దానిని కాపాడుకోవడం సామూహిక ప్రయత్నాల ద్వారా మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచేందుకు ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటు న్నమన్నారు. పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం ప్లాస్టిక్ , వాయు కాలుష్యాన్ని తగ్గించాలి ప్రకృతిని ప్రజలకు కనెక్ట్ చేయడం, చెట్లు నాటి గ్రీన్ ఎకానమీ పెంచడంచేయాలి అని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *