తాళ్లూరు మండలంలోని దోసకా యలపాడు రైతు భరోసా కేంద్రం పరిధిలో రైతు లకు గురువారం పచ్చిరొట్ట విత్తనాలను వ్యవసా యాధికారి బి.ప్రసాదరావు అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ …ఈ సీజన్లో రైతులు పచ్చిరొట్ట పైర్లను జనుము, జీలుగ, పిల్లిపెసర పైర్లతో నేలలో సేంద్రియ కర్బనం పెరిగి పైరు పంట కాలం అంతా అన్ని రకాల పోషకాలు మొక్కలకు అందజేస్తుందన్నారు. నేల గుల్లబారి నీటి నిల్వ శాతం పెరుగుతుందని తెలిపారు. సూక్ష్మ పోషకాలు ఎక్కువ పైర్ల పెరుగుదలకు తోడ్పడు తుందన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు సమీప రైతు భరోసా కేంద్రంలో సంప్రదించి పొందాలన్నారు.
