సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పుణ్య క్షేత్ర భారత్ గౌరవ్ రైలు ప్రారంభమైంది.
భారతీయ రైల్వేలు ,భారతదేశం యొక్క
గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను సందర్శించ డానికి ప్రారంభించిన థీమ్-ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్ రైలు ఈ భారత్ గౌరవ్ రైలు. ఈ రైలు ప్రయాణికుల నుండి ఎంతో భారీ ఆదరణ పొందింది. జూన్ 8న అయోధ్య-కాశీ పుణ్య క్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ రైలు ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మరోసారి ప్రారంభించారు. భారత్
గౌరవ్ రైలును ప్రయాణికులలో సీనియర్ సిటిజన్ శ్రీ దినేష్ చుట్కే (75 సంవత్సరాలు) మరియు శ్రీమతి సాధనా చుట్కే(63 సంవత్సరాలు) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి జండా ఊపి ప్రారంభించడంతో ప్రయాణం ప్రారంభమైనది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటిసీ) గ్రూప్ జనరల్ మేనేజర్ శ్రీ పీ . రాజ్ కుమార్ కూడా
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయోధ్య-కాశీ:పుణ్య క్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ రైలు
716 మంది పర్యాటకులతో 100% పూర్తి ఆక్యుపెన్సీతో బయలుదేరింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైలు ప్రయాణీకులందరికీ కొత్తగా నిర్మించిన రామజన్మభూమి(అయోధ్య) మరియు జ్యోతిర్లింగాలలో ఒకటైన (కాశీ విశ్వనాథ్ ఆలయం) దర్శనానికి ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం లేదా గయలో పిండ తర్పణం చేయదానికి (తమ పూర్వీకులకు నివాళులు అర్పించడం) ఇది అపూర్వ అవకాశాన్ని అందిస్తుంది. సికింద్రాబాద్‌తో పాటు
రెండు తెలుగు రాష్ట్రాలలో కాజీపేట (వరంగల్), ఖమ్మం , విజయవాడ, ఏలూరు , రాజమండ్రి, సామర్లకోట , వైజాగ్(పెందుర్తి) మరియు విజయనగరం వంటి 8 ప్రదేశాలలో ఈ రైలులో ఎక్కే/దిగే సౌకర్యాన్నిఅందిస్తుంది. ప్రయాణీకులందరిని 10 రోజుల పాటు పూరి, గయ, వారణాసి, అయోధ్య మరియు ప్రయాగ్‌రాజ్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తుంది .
2 ఏ సీ, 3 ఏ సీ మరియు స్లీపర్ కలిగిన మిశ్రమ కూర్పుతో ఏ.సీ మరియు నాన్-ఏసీ ప్రయాణీకులకు అవకాశాన్ని అందిస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుండి బయలు దేరిన ప్రయాణీకులతో పాటు మార్గంమధ్యంలోని స్టేషన్ల నుండి ప్రయాణీoచే ప్రయాణికులు కూడా ఏ సీ మరియు నాన్-ఎసి రైలు సేవలను పొందారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలుకు ప్రయాణికుల నుండి మంచి స్పందన లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటన వృద్ధికి భారత్ గౌరవ్ రైళ్లు పెద్దపీట వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయాణ అంశాలను ప్లాన్ చేయడంలో ఇబ్బంది లేకుండా సాంస్కృతికంగా ప్రముఖ మరియు చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని సద్వినియోగం కోవాలని రైలు వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.
భారత్ గౌరవ్ రైలు వివరాలు
పుణ్య క్షేత్ర యాత్ర : అయోధ్య – కాశీ
పర్యటన వివరాలు సికింద్రాబాద్ – పూరి – కోణార్క్ – గయ – వారణాసి – అయోధ్య – ప్రయాగ్‌రాజ్ – సికింద్రాబాద్
పర్యటన తేదీలు ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి తేదీ 08.06.2024న 12:00 గంటలకు బయలుదేరుతుంది మరియు తిరుగు ప్రయాణంలో 17.06.2024న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొంటుంది.
టూర్ కాల వ్యవధి 9 రాత్రులు / 10 రోజులు
బోర్డింగ్ / డి-బోర్డింగ్ స్టేషన్లు సికింద్రాబాద్ , కాజీపేట (వరంగల్), ఖమ్మం , విజయవాడ, ఏలూరు , రాజమండ్రి, సామర్లకోట , వైజాగ్ ( పెందుర్తి ) & విజయనగరం
ఒక్కొక్కరికి ధర (జి. ఎస్. టి. తో సహా) ఎకానమీ కేటగిరీ (స్లీపర్ ): రూ . 16,525/-
ప్రామాణిక వర్గం (3 ఎ.సి ): రూ . 25,980/-
కంఫర్ట్ కేటగిరీ (2 ఎ.సి): రూ . 33,955/-
బుకింగ్ కోసం IRCTC: http://www.irctctourism.com వెబ్‌సైట్‌ని సందర్శించండి
కౌంటర్ బుకింగ్స్ కోసం సంప్రదించండి:
సికింద్రాబాద్ : 040-27702407, 9701360701, 9281495845, 9281495843, 8287932228, 8287932229, 8287932231.




