దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ శ్రేణులు శుక్ర వారం సంబరాలు చేసుకున్నారు. దర్శిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం గడియార స్తంభం సెంటర్లో బాణసంచాపేల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకుని డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డికి ప్రమాణ స్వీకార మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
