బడి ఈడు చిన్నారులను బడిలో చేర్పించటమే లక్ష్యం గా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేను బడికి పోతా కార్యక్రమాన్ని మండల స్థాయి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎంఈఓ సుబ్బయ్య తెలిపారు. తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నేను బడికి పోతా కార్యక్రమంపై సమన్వయ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి మానేసిన చిన్నారులను గుర్తించి వారందరిని మళ్లీ బడిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాల న్నారు. బడి ఈడు పిల్లలు అందరూ నూరు శాతం బడిలో ఉండేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నూతనంగా బడిలో చేరిన వారికి స్టూడెంట్ కిట్, ఇతర విద్యా ప్రోత్సాహకాలు అందేలా చూడా లన్నారు. సమావేశంలో ఎంపీడీఓ కె.యుగకీర్తి, సీడీపీఓ భారతి, కేజీబీవీ ప్రిన్సిపాల్ సుజిత, ఎం ఈఓ -2 సుధాకరరావు, మూర్తి, శేషగిరిరావు, పాల్గొన్నారు.
