గుంటి గంగ వద్ద వైభవంగా చండీ మహాయాగం

జిల్లాలో తాళ్లూరు మండలం తూర్పు గంగవరం పంచాయతీ సోమవరప్పాడు రెవెన్యూ పరిధిలో ప్రసిద్ధ
పుణ్యక్షేత్రం శ్రీ గుంటిగంగా భవాని అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం చండీ మహాయాగం వైభవంగా నిర్వహించారు. చండీ మాత సకల దేవతా స్వరూపిణి, ఆమె అమ్మలగన్న అమ్మ, సృష్టి చక్రానికి కారణమయ్యే బ్రహ్మిగా సుఖ సంపదలతో చల్లగా కాపాడే వైష్ణవిగా సకల సౌభాగ్య మంగళాలను ప్రసాదించే తాంకరిగా, జగజ్జనని వేదాని వాజ్మయంలో స్తుతింపబడిం ది. ఆ చల్లని తల్లిని ప్రసన్నం చేసుకొని సకల జనపదాలకు దేశానికి, ప్రజలకు మంచి జరిగి ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్య భాగ్యాలను ఆకాంక్షిస్తూ తలపెట్టిన పవిత్ర కార్యమే ఆయుత చండీ మహాయాగమని వేద పండితులు కొనియాడారు. చండీ మహాయాగం కార్యక్రమంలో భక్తులు పెద్ద సం ఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హోమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించారు. ఆలయ పూజారులు కామేశ్వరశర్మ, ప్రసాదరావు, బాలరాజులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం, ఈఓ కార్తీక్ , ఆర్.ఏ శ్రీనివాసరావు భక్తులకు అన్ని వసతులు కల్పిం చారు. తాళ్లూరు ఎస్ఐ విజయకుమార్ ప్రత్యేక పూజలు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *