డిగ్రీ ఫలితాలలో హర్షిణి విద్యార్థుల ప్రతిభ

డిగ్రీ మూడవ సంవత్సర ఫలితాలలో హర్షిణీ డిగ్రీ కళాశాల విద్యార్థులు యూనివర్సీటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపాల్ దాది ఆంజనేయులు తెలిపారు. బి.కాం విభాగంలో కలువ శైలజ (622/700) -మార్కులతో మొదటిస్థానాన్ని, పర్చూరి బార్గవి (615/700) ద్వితీయ స్థానాన్ని, కంభం పాటి స్వాతి (618/700) మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు. బిసీఏ విభాగంలో చిట్టూరిరత్న మొఘన (842/900) మొదటి స్థానాన్ని, రాయసం నిరుపమా సంజన (840/900) ద్వితీయ స్థానాన్ని, బత్తుల ఎస్తేరు రాణి, యానం దివ్య (827/900) మార్కులతో మూడవ స్థానం సాధించారని చెప్పారు. బిఏ విభాగంలో వెలమ కన్ని వెంకట సాయి సత్యలత (514/600), ప్రధమ, మారం శిరీష (497/600) ద్వితీయ, పల్లవి వెంకట అమృత (492/600) తృతీయ స్థానాన్ని సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యూనివర్సీటీ స్థాయిలో అత్యధిక మార్కులు హర్షిణి విద్యార్థులు సాదించటం హర్షించదగిన విషయమని చెప్పారు. డిగ్రీతో పాటు క్యాంపస్ ప్లేస్ మెంట్స్లోలో ఉద్యోగాలు ఇప్పిస్తున్న కల్పిస్తున్న ఎకైక విద్యాసంస్థ హర్షిణి అని చెప్పారు. ఇప్పటి వరకు 610 విద్యార్థులు ప్రాంగణ ఎంపికలలో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. ఆదివారం అనగా 23న ప్రముఖ మల్టీ నేషనల్ ఏడు కంపెనీలు ప్రాంగణ ఎంపికలలో పాల్గొనన్నుట్లు చెప్పారు. ప్రతి విద్యార్థికి డిగ్రీతో పాటు ఉద్యోగం కల్పించటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మంచి మార్కులు సాధించటానికి కృషి చేసిన ఆధ్యాపక బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత, ప్రిన్సిపాల్ దాది ఆంజనేయులు, ఎవో ర్యాంకర్ శ్రీనివాసరావు, పీజీ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *