తెలంగాణలో పీజీ ప్రవేశాలు – సీపీగెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల,..తేదీలు

తెలంగాణ సీపీగెట్ (TS CPGET 2024) పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి తేదీలను ప్రకటించింది. జూలై 6వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూలై 17వ తేదీతో ఈ పరీక్షలన్నీ పూర్తి కానున్నాయి.రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సు ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ సీపీగెట్ నిర్వహిస్తోంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న 297 పీజీ కాలేజీల్లో 51 కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ నిర్వహిస్తున్నారు.  మే 18 నుంచి జూన్‌ 17 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించారు. రూ.500 ఆలస్య రుసుముతో జూన్‌ 25వ తేదీ వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో జూన్‌ 30 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

సీపీగెట్ పరీక్షలను జూలై 6వ తేదీ నుంచి  కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.

సీపీగెట్‌ పూర్తి వివరాలను www.osmania.ac.in, www.ouadmissions.com, www.cpget.tsche.ac.in వెబ్‌సైట్లలో చూడొచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

సీపీగెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఎంబీబీఎస్, బీటెక్‌ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్‌ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్‌ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే అవుతారు.

*ప్రవేశాలు కల్పించే కోర్సులు..*

ఎంఈడీ (MEd)
ఎంఏ (MA)
ఎంఎల్ఐఎస్సీ (MLISC)
ఎంఎస్‌డబ్ల్యూ (MSW)
ఎంహెచ్ఆర్‌ఎం (MHRM)
ఎంటీఎం (MTM)
ఎంకామ్ (MCom)
ఎంపీఈడీ (MPEd)
ఎంఎస్సీ (MSc)
ఎంబీఏ (5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్)
మొత్తం 100 మార్కులకు సీపీగెట్ పరీక్ష నిర్వహిస్తారు.ఈ ఏడాది ఉస్మానియా వర్శిటీ నిర్వహిస్తోంది. ప్రశ్నాపత్రంలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్-ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్-ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు. ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *