బేగంపేట ప్రధాన రోడ్డు రసూల్ పుర మెట్రో స్టేషన్ ముందు డ్రైనేజీ ఓవర్ ఫ్లో తో ప్రధాన రోడ్డు అంతా మురుగునీటి మయంగా మారింది. ఇదే విషయంపై జె ఎస్ డి ఎం న్యూస్ లో,, ప్రధాన రోడ్డుపై మురుగు పరుగు వాహనదారులు ఇక్కట్లు ,,
అనే కథనం ప్రచురితమైంది దీనిపై స్పందించిన వాటర్ వర్క్స్ శాఖ అధికారులు రసూల్ పుర మెట్రో స్టేషన్ ముందు పొంగిపొర్లుతున్న డ్రైనేజీ వద్ద శివరేజి క్లీనర్ తో మరమ్మతులు నిర్వహించారు. ఈ డ్రైనేజీ పొంగిపొర్లు తో ప్రధాన రోడ్డుపై పారుతూ వాహనదారులకు పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగించింది రసూల్పుర మెట్రో స్టేషన్ నుంచి మినిస్టర్ రోడ్డు వరకు మురుగునీరు పారుతుండటంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు ఈ విషయాన్ని జె ఎస్ డిఎం న్యూస్ లో కథనం ప్రచురితం చేసింది దీనిపై స్పందించిన వాటర్ వర్క్స్ అధికారులు ఆదివారం తమ సిబ్బందితో రసూల్ పురం మెట్రో స్టేషన్ వద్ద పొంగిపొర్లుతున్న మ్యాన్ హోల్ వద్ద శివరేజి క్లీనర్ మిషన్ తో మరమ్మతులు నిర్వహించారు దీంతో డ్రైనేజీ ఓవర్ ఫ్లో ఆగిపోయింది. ప్రధాన రోడ్డుపై మురుగునీటి సరఫరా నిలిచిపోవడంతో వాహనదారులు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .



