మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ ఈ నెల 10 వ తేదీన మరణించారు. విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని రాధికా కాలనీలోని శంకర్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. ఆయన శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు వారి మాతృమూర్తి లలితా బాయి ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.



