జే హెచ్ ఎం సి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు షేక్ గౌస్……
ఆదివారం సాయంత్రం నగరంలో కురిసిన అకాల వర్షానికి మినిస్టర్ రోడ్డు కిమ్స్ హాస్పటల్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టు తీవ్ర గాలి వానకు నేలకొరిగింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.ఇదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గం ఏ బ్లాక్ మాజీ అధ్యక్షులు షేక్ గౌస్ రోడ్డుపై చెట్టు కూలిపోయి ట్రాఫిక్ జామ్ అయిన సమాచారాన్ని జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందికి తెలియజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది కూలిపోయిన చెట్టు కొమ్మలను కట్ చేసి తొలగించారు.దీంతో రాకపోకలకు అంతరాయం లేకుండా ఆ మార్గంలో ట్రాఫిక్ సాఫీగా సాగింది. ఈ కార్యక్రమం లో గౌస్ తో పాటు మహ్మద్ అశ్లాo వున్నారు.


