రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బోనాలను హైదరాబాద్ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా నిర్వహించాలని
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమం, జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం బోనాల నిర్వహణకు 20 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ముఖ్యమైన దేవాలయాల వారీగా సమావేశాలు కొనసాగుతుండడంతో జూలై 8,9,10 వ తేదీల్లో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ,ఉత్సవాల పై అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూలై 8,9,10 తేదీల్లో బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో జరిగే అమ్మవారి కళ్యాణం , రథోత్సవం , తదితర కార్యక్రమాల పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసారి మహ లక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో గతంలో కంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గుడి చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ,గతంలో బ్యారీకెడ్లు ఎత్తులో ఉండడం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తాయని ఈసారి బారీకెడ్ల ఎత్తు తగ్గించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు.. సూచిక బోర్డులు , ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు , క్యులైన్ లలో భక్తులకు కొంత ప్లేస్ ఉండేవిధంగా ఏర్పాటు చేయడంతో పాటు వారికి తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.. గత బోనాల సమయంలో వివిఐపి పాసులు అధికంగా ఇవ్వడం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తాయని పోలిసులు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు.ఈసారి ప్రతి గుడిలో వీవీఐపీ పాసులు తగ్గేలా దేవాదాయ శాఖ అధికారులు , సమన్వయం చేసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం శాంతి భద్రతలకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని మహిళా భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక షీ టీమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. గుడికి చుట్టుపక్కల ఉన్న రోడ్లలో ట్రాఫిక్ డైవర్షన్ చేసుకునేలా ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
నిరంతర విద్యుత్ సరఫరా ఉండడంతో పాటు ప్రత్యేక జనరేటర్లు ,మొబైల్ ట్రాన్సఫర్మర్లు , ప్రత్యేక ఎలక్ట్రిక్ ఉద్యోగులు నిరంతరం అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ టాయిలెట్స్ , ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలి. బ్లీచింగ్ ద్వారా క్లోరినేషన్ చేయాలి. జీహెచ్ఎంసీ నిరంతర శానిటేషన్ బృందాలను పర్యవేక్షించాలి. 20 వాటర్ ట్యాంకర్లు అదనంగా నిరంతరం అందుబాటులో ఉంచాలి.జూలై 8,9,10 వ తేదీల్లో బల్కంపేట ప్రాంతంలో నిరంతం నీరు అందేలా వాటర్ వర్క్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కళ్యాణం తరువాత రథోత్సవం సమయంలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలి,చిన్న అంబులెన్స్ లు అందుబాటులో ఉంచాలి ప్రత్యేక సీపీఆర్ బృందాలకు శిక్షణ ఇచ్చి అందుబాటులో ఉంచాలి. ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయాలి. టూ వీలర్ ఫైర్ వెహికిల్ శిక్షణ పొందిన ఫైర్ సిబ్బంది ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఆర్టీసి బోనాల జాతర కి ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసింది. ప్రయాణికులు అధికంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. బస్ స్టేషన్ లో వద్ద ఈవ్ టీజింగ్ కి తావు లేకుండా మహిళా పోలీసు బృందాలు ఏర్పాటు చేయాలని,ఉత్సవాల సందర్భంగా 500 మంది ప్రత్యేక కళాకారులు వివిధ ప్రదర్శనలు చేయనున్నాయని . భక్తులకు సమాచారం అందించడానికి ఎల్ఈడి స్క్రీన్ లు , దాదాపు కిలోమీటరు దూరం వరకు వినిపించే విధంగా మైక్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు.
స్థానిక దేవాలయ కమిటీ లు పలు సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. ఉత్సవాల సందర్భంగా డీజే కి అనుమతి ఇవ్వవద్దని కోరగా పోలీసులు బల్కంపేట ఉత్సవాలకు డిజే అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు అధికారులు తెలిపారు.. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తుల సహకారం కూడా కావాలని ఒక్కో దేవాలయంలో ఒక్కోసారి ఉత్సవాలు జరుగుతున్నందున అధికారులు సమన్వయం చేసుకోవాలి. అమ్మవారి ఉత్సవాలు విజయవంతంగా జరిగే విధంగా అమ్మ వారి ఆశీర్వాదం ఇవ్వాలని మంత్రి కోరారు . ఈ సందర్భంగా మంత్రి బోనాల పోస్టర్ ను ఆవిష్కరించారు
ఈ సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ,కమీషనర్ హన్మంతరావు,వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ,ట్రాఫిస్ డిసిపి రాహుల్ హెగ్డే, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ,సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోటా నీలిమ , స్థానిక కార్పొరేటర్ సరళ జీహెచ్ఎంసీ, పోలీస్ ,వాటర్ వర్క్స్, విద్యుత్ ,ఆర్ అండ్ బి ఇతర ముఖ్య శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..


